కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆలయం ఎదుట రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో బైకుపై ఉన్న కమ్మరి సిద్ధరాములు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. కమ్మరి అంజయ్య అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి - తాడ్వాయిలో బైకును ఢీకొట్టిన కారు వార్తలు
కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేట్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.