కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి ఇద్దరు యువకులు తీవ్రగాయాల పాలయ్యారు. కాగజ్‌నగర్ పట్టణం అశోక్ కాలనీ, సంఘం బస్తీకి చెందిన హరికృష్ణ, సురేశ్, భాను స్నేహితులు. ముగ్గురూ ఒకే ద్విచక్రవాహనంపై ఈస్గాం నుంచి కాగజ్‌నగర్ వైపు వెళ్తుండగా ఆర్ఆర్ఓ కాలనీ వద్ద ప్రమాదానికి గురై గుంతలో పడ్డారు.
అదుపుతప్పిన ద్విచక్రవాహనం... ఇద్దరికి తీవ్ర గాయాలు - కాగజ్‌నగర్‌లో బైక్ ఆక్సిడెంట్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ద్విచక్రవాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురు స్నేహితులు ఒకే ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఘటన జరిగింది. గాయాలపాలైన ఇద్దరిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అదుపుతప్పిన ద్విచక్రవాహనం... ఇద్దరికి తీవ్ర గాయాలు
ఈ ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ వెంకటేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:కరోనా మృతదేహంతోనే మరొకరి భౌతికకాయం.. కుటుంబసభ్యుల్లో భయంభయం