తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బైకును ఢీకొట్టిన ట్రాక్టర్.. మహిళ మృతి​ - జడ్చర్లలో రోడ్డు ప్రమాదం వార్తలు

ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్​ ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మహబూబ్​నగర్​ జిల్లాలో చోటుచేసుకుంది.

bike accident at badepalli market in mahabubnagar district
బైకును ఢీకొట్టిన ట్రాక్టర్.. మహిళ మృతి​

By

Published : Jun 15, 2020, 11:55 AM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్​ సమీపంలో ట్రాక్టర్​ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో బైక్​పై ఉన్న సునీత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

నాగర్​కర్నూల్​ జిల్లా తిమ్మాజీపేట మండలానికి చెందిన వెంకటేశ్​, సునీత దంపతులు ద్విచక్ర వాహనంపై జడ్చర్లకు వెళ్తుండగా.. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్​ సమీపంలో ట్రాక్టర్ వీరి బైకును​ ఢీకొట్టింది. ఘటనలో సునీత ట్రాక్టర్ చక్రాల​ కింద పడటం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. వెంకటేశ్​కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి: తాగిన మైకంలో తండ్రిపై కత్తితో దాడి

ABOUT THE AUTHOR

...view details