నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బార్డిపూర్ శివారులోని ఓ కల్యాణ మండపంలో భారీ చోరీ జరిగింది. సిద్దిపేటకు చెందిన అబ్బాయితో మహారాష్ట్రలోని ఉమ్రికి చెందిన అమ్మాయికి వివాహం నిర్వహించారు. పెళ్లి కూతురు నగలు ఓ బ్యాగ్‌లో పెట్టారు.
ఏకంగా పెళ్లికూతురు నగలే ఎత్తుకెళ్లారు
పెళ్లి అంటే ఎంతో హడావుడి ఉంటుంది. ఎవరి పనిలో వారు బిజీగా ఉంటారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఏకంగా పెళ్లికూతురు నగలే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ఓ కల్యాణ మండపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఏకంగా పెళ్లికూతురు నగలే ఎత్తుకెళ్లారు
మధ్యాహ్నం సమయంలో వివాహం జరుగుతున్న వేదిక వద్దకు ఇద్దరు యువకులు వచ్చి ఆ బ్యాగ్‌ను అపహరించారు. నగలు పెట్టేందుకు చూడగా బ్యాగ్ కనపడకపోవటంతో పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. దాదాపు 35 తులాల బంగారు ఆభరణాలు దుండగులు అపహరించినట్లు బాధితులు తెలిపారు.
ఇదీ చదవండి:తస్మాత్ జాగ్రత్త: మీ మెయిల్లోకి దూరేస్తాడు.. రహస్యాలన్నీ కాజేస్తాడు!