తెలంగాణ

telangana

By

Published : Dec 30, 2020, 10:56 AM IST

ETV Bharat / jagte-raho

తాళం పగులగొట్టి.. కౌన్సిలర్​ ఇంట్లో భారీ చోరీ!

కామారెడ్డి జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీ 15వ వార్డు కౌన్సిలర్ వనిత రామ్మోహన్ ఇంట్లో దుండగులు చొరబడ్డారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో తాళాలు పగులగొట్టి.. 52 తులాల బంగారం, 60 తులాల వెండితో పాటు రూ.2 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంత్యక్రియల నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లగా ఈ దొంగతనం జరిగింది.

big robbery in counsellor home kamareddy district
తాళం పగులగొట్టి.. కౌన్సిలర్​ ఇంట్లో భారీ చోరీ!

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కౌన్సిలర్​ వనిత రామ్మోహన్​ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంటికి తాళం వేసి ఉండటంతో దుండగులు తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. 52 తులాల బంగారం, 60 తులాల వెండితో పాటు రూ. 2 లక్షల నగదును దోచుకెళ్లారు.

అసలేం జరిగింది?

కౌన్సిలర్ వనిత రామ్మోహన్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. రామ్మోహన్ సోదరుడు శ్రీనివాస్ కూమార్తె స్నేహ వివాహం ఈ నెల 24న కామారెడ్డిలో జరిగింది. ఈ వివాహ వేడుకలకు బంధువులు అందరూ హాజరయ్యారు. మరుసటిరోజే కౌన్సిలర్ భర్త.. రామ్మోహన్ తండ్రి లక్ష్మి రాజాం మృతి చెందాడు. దీంతో స్నేహ వివాహానికి సంబంధించి బంగారంతో పాటు బంధువుల బంగారాన్ని వనిత ఇంట్లో ఉంచి అంత్యక్రియలకు మాచారెడ్డి మండలం గజ్జయ నాయక్ తండాకు వెళ్లారు.

తాళం పగులగొట్టి.. కౌన్సిలర్​ ఇంట్లో భారీ చోరీ!

ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తి కౌన్సిలర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అదే రోజు ఉదయం కుటుంబ సభ్యులు, బంధువులు ఇంట్లోకి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే విషయాన్ని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి:చర్లపల్లి జైలులో రిమాండ్​ ఖైదీ మృతి

ABOUT THE AUTHOR

...view details