యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై గల అవుషాపూర్ సమీపంలోని ఓ ఇంట్లో కల్తీపాలు తయారు చేస్తున్నారన్న సమాచారం అందుకున్న భువనగిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో ఒకరు బీఎన్ తిమ్మాపూర్కి చెందిన జంగిటి నర్సింహగా గుర్తించారు. మరో నిందితుడు ఎరుకల భాస్కర్ పరారీలో ఉన్నాడు.
కల్తీపాలు తయారు చేస్తున్న ఇంటిపై ఎస్ఓటీ పోలీసుల దాడి - యాదాద్రి క్రైమ్ వార్తలు
కల్తీపాలు తయారుచేసి.. అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులు కల్తీపాలు తయారు చేస్తుండగా.. దాడుల్లో ఒకరు పరారయ్యారు. నిందితుల నుంచి బొలెరో వాహనం, 250 లీటర్ల కల్తీపాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కల్తీపాలు తయారు చేస్తున్న ఇంటిపై.. ఎస్ఓటీ పోలీసుల దాడి
నిందితుని వద్ద 250 లీటర్ల కల్తీపాలు, ఏడు డోలోఫర్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు, బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నర్సింహను ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
ఇదీ చదవండి:'కేంద్రమే అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలి'