తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భువనగిరిలో శిశు విక్రయం.. బాలల పరిరక్షణ కేంద్రానికి తరలింపు - డీఎన్​ఏ పరీక్షలు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో శిశు విక్రయం వెలుగు చూసింది. ఆడ శిశువును అమ్మేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ సుధాకర్​ తెలిపారు. తల్లీబిడ్డలను నల్గొండలోని బాలల పరిరక్షణ కేంద్రానికి తరలించారు.

భువనగిరిలో శిశు విక్రయం.. బాలల పరిరక్షణ కేంద్రానికి తరలింపు
Bhuvanagiri Police Arrest Two Peoples For Selling baby girl

By

Published : Sep 24, 2020, 6:50 PM IST

యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం నేరెడ్​మెట్​కు వలస వెళ్లారు. ఆ కుటుంబానికి చెందిన యువతికి అదే ప్రాంతంలో ఉండే ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. అది కాస్తా ప్రేమగా మారి ఆమె గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమని కోరగా.. ప్రియుడు ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు నేరెడ్​మెట్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు కొనసాగుతోంది. కాగా.. సదరు యువతి సెప్టెంబర్​ 12న భువనగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 14న రూ.60వేలకు ఆ శిశువును మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​ మండలం ఏదులాబాద్​కు చెందిన ఓ మహిళకు విక్రయించింది.

యువకుడి మీద పెట్టిన కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాధితురాలిని శిశువు గురించి అడిగారు. డీఎన్​ఏ పరీక్షల కోసం శిశువును తీసుకురావాల్సిందిగా కోరారు. కాగా.. శిశువు చనిపోయినట్టు యువతి పోలీసులకు చెప్పింది. ఆమె ప్రవర్తన మీద అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా అడగగా.. రూ.60 వేలకు అమ్మేసినట్టు తెలిపింది. పసిబిడ్డను అమ్మినందుకు గానూ.. పోలీసులు యువతితో పాటు మరొకరి మీద కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు. తల్లీబిడ్డలను సఖి కేంద్రంలో ఉంచారు. అనంతరం నల్లగొండలోని బాలల పరిరక్షణ కేంద్రానికి తరలించారు. యువతికి, శిశువుకు డీఎన్​ఏ పరీక్షలు నిర్వహించడం కోసం.. వారిని శుక్రవారం నాడు హైదరాబాద్​కు తరలించనున్నట్టు జిల్లా బాలల పరిరక్షణ అధికారి సైదులు తెలిపారు.

ఇవీచూడండి:పోలీసు స్టేషన్​కు పిలిచారని మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details