భద్రాది కొత్తగూడెం జిల్లా థర్మల్ విద్యుత్ కేంద్రంలో పనిచేసే కిరణ్ కుమార్(40) అనే జెన్కో ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. పాల్వంచ కేటీపీఎస్ నుంచి మణుగూరులోని భద్రాది థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఇటీవలె కిరణ్ కుమార్ బదిలీపై వచ్చాడు.
గుండెపోటుతో జెన్కో ఉద్యోగి మృతి - భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగి గుండెపోటుతో మృతి
జెన్కోలో విధులు నిర్వహిస్తూ ఓ ఉద్యోగి గుండె పోటుతో మృతి చెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకుంది.
గుండెపోటుతో జెన్కో ఉద్యోగి మృతి
బీటీపీఎస్‌లో అతను ప్లాంట్ అటెండెంట్(పీఏ)గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఈరోజు నాలుగో యూనిట్ వద్ద మెట్లు ఎక్కిపైకి వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇదీ చూడండి :భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్