రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న దొంగను భద్రాచలం సీఐ స్వామి అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన బాణాల ప్రశాంత్... జయశంకర్ భూపాల పల్లి, ములుగు, వరంగల్, నల్గొండ, ఏపీలోని విజయవాడలలో ఏటీఎంలలో దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఏటీఎం దొంగ ఎట్టకేలకు చిక్కాడు - భద్రాచలం వార్తలు
అనేక జిల్లాల్లో ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న కరుడు గట్టిన దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన భద్రాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడిపై ఇప్పటివరకు 14 చోట్ల కేసులు నమోదైనట్లు సీఐ వెల్లడించారు.
ఏటీఎంలే అతని టార్గెట్... ఎట్టకేలకు చిక్కిన నిందితుడు
14 చోట్ల ఇతనిపై కేసు నమోదైనట్లు సీఐ తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్పీ సునీల్‌దత్‌ను సీఐ అభినందించారు.
ఇదీ చూడండి:20ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
Last Updated : Feb 5, 2021, 7:30 PM IST