కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్దపోతంగల్ గ్రామంలో విషాదం నెలకొంది. శనివారం నాడు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బావ, మరదలు మృతి చెందారు. మరదలికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైనందుకే మనస్తాపం చెంది.. ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి బావామరదళ్ల కథ విషాదాంతం - kamareddy crime updates
కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్యకు యత్నించిన బావ, మరదలు మృతి చెందారు. కరీంనగర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరదలు మృతి చెందగా.. ఇవాళ బావ మరణించాడు.
గాంధారి మండలం పెద్దపోతంగల్ గ్రామానికి చెందిన సాయిరాం.. కామారెడ్డి మండలం అడ్లూర్కు చెందిన రమ్య వరుసకు బావామరదలు.. ఈనెల 2న బాన్సువాడ పరిధిలోని బోర్లం గ్రామానికి చెందిన వ్యక్తితో రమ్యకు పెళ్లి నిశ్చయమైంది. బావతో కాకుండా వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించినందున ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బావ ఇవాళ చనిపోగా.. మరదలు ఆదివారం మృతి చెందింది.
ఇదీ చూడండి: కామారెడ్డి జిల్లాలో బావ, మరదలి ఆత్మహత్యాయత్నం