తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రోడ్డుపైనే మృతదేహం... కన్నెత్తి చూడని జనం

కరోనా భయం మనుషుల్లో మానవత్వాన్ని మాయం చేస్తోంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే తత్వాన్ని ప్రజలు కోల్పోతున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

barbaric-incident-took-place-in-pithapuram-in-east-godavari-district
రోడ్డుపైనే మృతదేహం... కన్నెత్తి చూడని జనం

By

Published : Jul 23, 2020, 11:32 AM IST

రోడ్డుపైన ఓ వృద్ధురాలు కుప్పకూలితే కనీసం కన్నెత్తయినా చూడలేదు అక్కడి జనం. ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. కరోనా భయంతో గడప దాటలేదు. ఫలితంగా ఆమె మృతదేహం గంటల తరబడి రోడ్డుపైనే ఉండిపోయింది.

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో అమానుష ఘటన జరిగింది. పట్టణానికి చెందిన నాగమణి స్టువర్ట్​పేటలో అస్వస్థతకు గురై రోడ్డుపైనే కుప్పకూలి మృతి చెందారు. కరోనా భయంతో ఏ ఒక్కరూ దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేదు.

విషయం తెలుసుకుని అధికారులు వచ్చినప్పటికీ... మృతదేహం వద్దకు వెళ్లలేదు. మృతురాలి వివరాలు సేకరించి.. ఆమె కుమార్తెకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇదీచూడండి: మన్యంలో మావోలు... ఎప్పుడు ఏం జరుగుతుందో!

ABOUT THE AUTHOR

...view details