వరంగల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రానికి చెందిన పాము శ్రీనివాస్గా పోలీసులు గుర్తించారు. అతడి నుంచి రూ. 4 లక్షల విలువైన గుట్కా, అంబర్ ప్యాకెట్లు వున్న తొమ్మిది బ్యాగులు, ఒక కారు, రూ. 49,480 మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రూ.4 లక్షల విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం..
వరంగల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడుతున్న మహబూబాబాద్ జిల్లా వాసిని వర్ధన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ. 4 లక్షల విలువ చేసే గుట్కా, నగదు స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితుడు ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కర్నాటకలోని బీదర్లో పెద్ద మొత్తంలో పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాదు, సూర్యాపేట, తొర్రూరు మీదుగా వరంగల్ నగరంలో గుట్కా, అంబర్ నిషేధిత ఉత్పత్తులు సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలో వర్ధన్నపేట పోలీసులు ఇల్లంద గ్రామ శివారు ప్రాంతంలో తనీఖీలు నిర్వహించి అక్రమంగా కారులో తరలిస్తున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:చెరువులో శిశువు మృతదేహం లభ్యం..