తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రేపు ఉదయం కడప జిల్లా కోర్టుకు బండ్ల గణేశ్ - రేపు ఉదయం కడప జిల్లా కోర్టుకు బండ్ల గణేశ్

bandla ganesh

By

Published : Oct 23, 2019, 7:36 PM IST

Updated : Oct 23, 2019, 9:31 PM IST

19:33 October 23

రేపు ఉదయం కడప జిల్లా కోర్టుకు బండ్ల గణేశ్

రేపు ఉదయం కడప జిల్లా కోర్టుకు బండ్ల గణేశ్

సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ ఫిర్యాదుతో బండ్ల గణేశ్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. టెంపర్ సినిమా నిర్మాణం కోసం రూ.30 కోట్లు అప్పు తీసుకొని... రూ.7 కోట్లు చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు... పీవీపీ ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో బండ్ల గణేశ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసుకు సంబంధించి ప్రశ్నించిన అనంతరం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బంజారాహిల్స్‌లోనూ నమోదైన కేసులో బండ్ల గణేశ్​ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కడప జిల్లాకు చెందిన మహేశ్​ అనే వ్యక్తి తన వద్ద నుంచి రూ.13 కోట్లు తీసుకున్నట్లు ఫిర్యాదు చేశాడు. ఈ కేసుకు సంబంధించి బండ్ల గణేశ్‌పై కడప జిల్లా న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం కడప కోర్టులో పోలీసులు బండ్ల గణేశ్‌ను హాజరుపరచనున్నారు. 

Last Updated : Oct 23, 2019, 9:31 PM IST

ABOUT THE AUTHOR

...view details