యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న శిశు విక్రయ ఘటనను పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ నేరేడుమేట్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసు విచారణలో భాగంగా... భువనగిరిలో జరిగిన శిశు విక్రయం వెలుగు చూసింది. నేరేడుమెట్ ఎస్సై... యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ ప్రోటక్షన్ ఆఫీసర్‌కి సమాచారం అందించగా కేసు నమోదు చేశారు.
శిశువు విక్రయ ఘటనను ఛేదించిన పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన శిశువు విక్రయ ఘటనను పోలీసులు ఛేదించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్కు చెందిన ఓ మహిళకు.. భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో జన్మనిచ్చిన ఓ యువతి తల్లి శిశువును విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
baby girl sale issue cracked in bhuvanagiri
భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఓ యువతి... ఈ నెల 12 న ఆడశిశువుకు జన్మనిచ్చింది. 14న 60 వేల రూపాయలకు శిశువును సదరు యువతి తల్లి... మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్కు చెందిన మరో మహిళకు విక్రయించింది. నేరేడ్మెట్ పోలీసులు, ఆ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఏదులాబాద్కు వెళ్లి శిశువును స్వాధీనం చేసుకున్నారు. తల్లీబిడ్డలను భువనగిరి జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్లో అధికారుల పర్యవేక్షణలో ఉంచారు.
ఇదీ చూడండి: ప్రియుడి మోజులో పడి భర్త ప్రాణాలు తీసిన భార్య
Last Updated : Sep 23, 2020, 8:54 AM IST