ఏపీలోని విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం చినగుడబలో విషాదం చోటుచేసుకుంది. గొంతులో ప్లాస్టిక్ బొమ్మ అడ్డుపడి 8 నెలల చిన్నారి మౌనిక మృతి చెందింది. తినుబండారాల ప్యాకెట్‌లో బహుమతిగా వచ్చిన బొమ్మను మింగేసినట్లుగా చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
గొంతులో ప్లాస్టిక్ బొమ్మ అడ్డుపడి 8 నెలల చిన్నారి మృతి - ఏపీ నేరవార్తలు
తినుబండారాల ప్యాకెట్‌లో బహుమతిగా వచ్చిన బొమ్మను మింగి 8 నెలల చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా చినగుడబలో జరిగింది.
గొంతులో ప్లాస్టిక్ బొమ్మ అడ్డుపడి 8 నెలల చిన్నారి మృతి