తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అప్పుడే పుట్టిన శిశువును రోడ్డుపై వదిలేసిన కసాయిలు - నిజామాబాద్ లేటెస్ట్ అప్డేట్స్

తల్లిపొత్తిళ్లలో ఉండాల్సిన నవజాత శిశువుని కర్కశంగా రోడ్డుపై వదిలేశారు కసాయి తల్లిదండ్రులు. పుట్టగానే వద్దనుకున్నారో ఏమోగాని అప్పుడే పుట్టిన పసికందును రోడ్డుపై పడేశారు. బొడ్డుతాడుతో ఉన్న ఆ ముద్దులొలికే చిన్నారిని చూసిన స్థానికులు విలవిల్లాడారు.

baby boy in road in nizamabad district
అమానుషం: రోడ్డుపై అప్పుడే పుట్టిన చిన్నారి

By

Published : Nov 27, 2020, 6:11 PM IST

Updated : Nov 27, 2020, 7:04 PM IST

అప్పుడే పుట్టిన బిడ్డను కర్కశంగా రోడ్డుపై వదిలేశారు కసాయి తల్లిదండ్రులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలోని ఓ స్కానింగ్ సెంటర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం 3:30 గంటలకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై ఉన్న ముద్దులొలికే శిశువును చూసిన స్థానికులు విలవిల్లాడారు.

వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు స్థానికులు సమాచారం అందించారు. వైద్య పరీక్షల కోసం శిశువుని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు సురక్షితంగానే ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. ఐసీడీఎస్ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌ టౌన్ పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:రైతులను నిండా ముంచిన నకిలీ విత్తనాలు

Last Updated : Nov 27, 2020, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details