ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో ఆబ్కారీ శాఖ అధికారులు సైకిల్ యాత్ర చేపట్టారు. మాదకద్రవ్యాలకు యువత బానిసకావొద్దని అవగాహన కల్పిస్తూ చేపట్టిన ఈ యాత్రకు ఆబ్కారీ సూపరింటెండెంట్ సోమిరెడ్డి నాయకత్వం వహించారు.
'యువత మత్తుకు బానిస కావొద్దు.. జీవితం పాడు చేసుకోవద్దు' - excise department awareness in khammam district
యువత మాదకద్రవ్యాలకు బానిస కావొద్దని, డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ ఖమ్మం జిల్లాలో ఆబ్కారీ శాఖ అధికారులు సైకిల్ యాత్ర చేపట్టారు. ఆబ్కారీ సూపరింటెండెంట్ సోమిరెడ్డి నాయకత్వంలో నిర్వహించిన ఈ యాత్రలో జిల్లాలోని ఎక్సైజ్ ఎస్సైలు, సీఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లాలో ఆబ్కారీ సైకిల్ యాత్ర
సైకిల్‌పై యాత్ర చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ సాగిన ఈ యాత్రలో జిల్లాలోని ఆబ్కారీ ఎస్సైలు, సీఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఇటీవల జిల్లాలో గంజాయి కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, యువత మత్తుకు బానిసగా మారుతున్నారని సోమిరెడ్డి తెలిపారు. ఆబ్కారీ శాఖ బాధ్యతగా యువతకు అవగాహన కల్పించడానికే ఈ యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు.