తన బావలు, వదినలు, మామయ్యలే హేమంత్‌ను హత్య చేయించారని హేమంత్ భార్య అవంతి ఆరోపించారు. హేమంత్‌ను తమ బంధువులు బలవంతంగా తీసుకెళ్లారని చెప్పారు. హేమంత్‌ను ఇద్దరు రౌడీలు కొట్టారని తెలిపారు. హేమంత్, తాను 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని.. గత జూన్ 10న వివాహం చేసుకున్నామని పేర్కొన్నారు. బీహెచ్‌ఈఎల్ సంతోషిమాత ఆలయంలో పెళ్లి చేసుకున్నామన్నారు.
వాళ్లే హత్య చేయించారు : హేమంత్ భార్య - హైదరాబాద్ వార్తలు
హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన హేమంత్ పరువు హత్యపై అతని భార్య అవంతి స్పందించారు. తన బావలు, వదినలు, మామయ్యలే హేమంత్‌ను హత్య చేయించారని ఆరోపించారు. నాన్నకు పెళ్లి ఇష్టం లేకుంటే తనను చంపాలని కాని హేమంత్‌ను చంపడం దారుణమన్నారు.
వారే హత్య చేయించారు: హేమంత్ భార్య
పెళ్లి తర్వాత చందానగర్ పీఎస్‌లో సెటిల్‌మెంట్‌కు వెళ్లామని వెల్లడించారు. నాన్నకు పెళ్లి ఇష్టం లేకుంటే తనను చంపాలన్నారు. నిందితులు కొల్లూరులో ఓఆర్‌ఆర్ ఎక్కి పటాన్‌చెరులో దిగారని తెలిపారు. తన పేరిట ఉన్న ఆస్తులు ఇప్పటికే కుటుంబసభ్యులకు రాసిచ్చానని చెప్పారు.
Last Updated : Sep 25, 2020, 11:57 AM IST