ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైద్యుడు కోట శ్రీహరిరావు స్థానిక సబ్ డివిజన్ పోలీసు కార్యాలయం వెనుకనున్న తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లగా ఆయన ఒక్కరే ఇంట్లో ఉన్నారు. సీసీటీవీ కెమెరాలు పైకి తిప్పేసి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు.. హత్య కేసుగా భావించి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో అనుమానాస్పద స్థితిలో వైద్యుడు మృతి - అవనిగడ్డ వైద్యుడు కోట శ్రీహరిరావు మృతి
వైద్యుడు కోట శ్రీహరిరావు.. ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సీసీటీవీ కెమెరాలు పైకి తిప్పి ఉన్న కారణంగా.. పోలీసులు ఈ ఘటనను హత్యగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రవీంద్రబాబు.. డాగ్ స్క్వాడ్‌ని రంగంలోకి దించారు.
కృష్ణా జిల్లాలో అనుమానస్పద స్థితిలో వైద్యుడు మృతి
డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్పీ రవీంద్రబాబు.. పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. త్వరలోనే నిందితులను గుర్తించి వాస్తవాలు నిగ్గు తేలుస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:ఆ టైమ్ దాటితే రెండేళ్ల జైలు, జరిమానా
TAGGED:
avanigadda doctor death