ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో రహమత్‌నగర్‌లో రోడ్డు పక్కనున్న ఓ హోటల్లోకి ఆటో దూసుకెళ్లింది. ప్రాణనష్టం తప్పినా.. వాహనం ముందు భాగంతో పాటు చిన్న, చిన్న సామగ్రి ధ్వంసమైంది. డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ఊహించని ప్రమాదం... తప్పిన అపాయం - ఆంధ్రప్రదేశ్ తాజా సమాచారం
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఆటో నడుపుతున్న డ్రైవర్‌కు అనుకోకుండా ఫిట్స్ వచ్చింది. పట్టణంలో రహమత్‌నగర్‌లోని ఓ హోటల్లోకి వాహనం దూసుకువెళ్లింది. చిన్న చిన్న సామగ్రితో పాటు ఆటో ధ్వంసం కాగా.. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
![ఊహించని ప్రమాదం... తప్పిన అపాయం auto-went-into-hotel-in-anantapuram-rehmat-nagar-as-driver-got-suddent-fits](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9429360-395-9429360-1604488202341.jpg)
ఊహించని ప్రమాదం...తప్పిన అపాయం
అతడిని ఆస్పత్రికి తరలించగా.. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అనారోగ్య సమయాల్లో వాహనాలు నడిపి.. ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. వాహన చోదకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.