సంగారెడ్డి జిల్లా జుక్కల్ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ రామచందర్.. తమ గ్రామం నుంచి పాశమైలారం వరకు ఆటో నడుపుతూ వస్తుండేవాడు. అయితే మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తి మూతపడిన బీపీఎల్ పరిశ్రమ చౌరస్తాలో ఆటో ఎక్కి పాశమైలారానికి వెళ్లాలని కోరాడు. మార్గమధ్యంలో ఆటోడ్రైవర్‌పై కత్తితో దాడి చేశాడు.
ఆటోడ్రైవర్‌పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి - attack on autodriver at pasamailaram
సంగారెడ్డి జిల్లా పాశమైలారం గ్రామంలో అర్థరాత్రి ఆటో డ్రైవర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. బాధితుడిని చందానగర్ ఆసుపత్రికి తరలించి... బీడీఎల్ భానూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆటోడ్రైవర్‌పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి
పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడిని చందానగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రామచందర్ పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు అనే కోణంపై పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:భర్తను కాపాడి ప్రాణాలు విడిచిన భార్య