నాలుగేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహ్డ్ మండల పరిధిలో చోటు చేసుకుంది. భాస్కర్నగర్కి చెందిన నాలుగేళ్ల చిన్నారి చాక్లెట్ కొనుక్కోనేందుకు ఇంటి సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లింది. స్థానికంగా ఉండే ఆటోడ్రైవర్ పింగళి గణేశ్.. చాక్లెట్లు ఇస్తానని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
నాలుగేళ్ల చిన్నారిపై... ఆటో డ్రైవర్ అత్యాచారం - ఆటోడ్రైవర్ వార్తలు
దేశంలో ఎక్కడో ఓ చోట నిత్యం అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందరో మహిళలు, చిన్నారులు కామాంధులకు బలైపోతున్నారు. తాజాగా చాక్లెట్ కోసమని కిరాణా దుకాణానికి వెళ్లిన నాలుగేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.
నాలుగేళ్ల చిన్నారిపై... ఆటో డ్రైవర్ అత్యాచారం
చిన్నారి ఏడుస్తూ ఇంటికి వచ్చి తల్లికి జరిగిన విషయాన్ని తెలిపింది. విస్తుపోయిన తల్లిదండ్రులు స్థానికులతో కలసి దుకాణం వద్దకు వెళ్లి ఆ కామాంధుడిని చితకబాదారు. అనంతరం పోలీసుస్టేషన్లో నిందితుడిని అప్పగించారు. గణేశ్‌పై పోక్సో కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బమ్మెర బాలకృష్ణ తెలిపారు.
ఇదీ చూడండి:స్నేహం మాటున చెరబట్టారు.. కటకటాలపాలయ్యారు