హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో నివాసముండే ఆంజనేయులు ఆటో డ్రైవర్. రోజూ మాదిరిగానే డ్రైవింగ్‌కి వెళ్లాడు. నారాయణగూడ నుంచి కాచిగూడ వైపు వెళ్తున్న క్రమంలో... మెట్రో స్టేషన్ వద్ద ఆంజనేయులుకు ఫిట్స్ వచ్చింది. పక్కకు ఆటో ఆపాడు కానీ... అక్కడే ఫిట్స్‌తో రక్తం కక్కుని చనిపోయాడు.
ఆటోలో రక్తం కక్కుకుని చనిపోయాడు.. - హైదరాబాద్ వార్తలు
నిత్యం జన సంచారముండే ప్రాంతం అది. ప్రజలు ఎంత బిజీగా ఉన్నారంటే... పట్టపగలు ఓ వ్యక్తి నడిరోడ్డుపై రక్తం కక్కుతూ చనిపోయిన పట్టించుకోలేనంతా బిజీ. ఆటో నడుపుతూ.. అకస్మాత్తుగా ఫిట్స్‌కు గురై ఓ డ్రైవర్ ప్రాణాలు వదిలిన ఘటన హైద్రాబాద్‌లో జరిగింది.
నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం... ప్రాణం పోతున్న పట్టించుకోని జనం
ఇంత జరుగుతున్నా... అటుగా వెళ్తున్న ఎవరూ దీనిని గుర్తించలేకపోయారు. కనీసం ఎవరైనా చూసి ఉంటే ఆంజనేయులు ప్రాణాలు దక్కేవి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవపరిక్ష నిమిత్తం... ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:20ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్