ఇల్లందు శివారులోని చెరువులో దూకి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సంజయ్ నగర్‌కు చెందిన పొన్నాడ శ్రీనివాసాచారి లలితాపురం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య - భద్రాద్రి కొత్తగూడెం క్రైం న్యూస్
ఓ వ్యక్తి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఇద్దరు పిల్లలకు తండ్రిని దూరం చేసింది. వ్యక్తి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇల్లందు శివారులో చోటుచేసుకుంది.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతోనే క్షణికావేశంలో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. మృతుడు ఆటోడ్రైవర్ కాగా... అతనికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి:ఏటీఎం చోరీకి నానా తంటాలు.. సీసీ కెమెరాల్లో కేటుగాళ్లు