ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం - ప్రగతిభవన్ వద్ద ఆత్మహత్య
![ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం suicide at pragathi bhavan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8843857-473-8843857-1600405699069.jpg)
10:32 September 18
ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆటోడ్రైవర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పెట్రోల్ పోసుకున్న అతడిపై నీళ్లు పోసి రక్షించారు. తెలంగాణ కోసం 2010లో అసెంబ్లీ వద్ద ఆత్మహత్యాయత్నం చేశానని బాధితులు వాపోయాడు. రాష్ట్రం వచ్చిన తర్వాత తనకు ఇళ్లు కూడా రాలేదంటూ నినాదాలు చేశాడు. ఆటోడ్రైవర్‌ను అడ్డుకున్న పోలీసులు... అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనతో ప్రగతి భవన్ వద్ద ఒక్కసారిగా కలకలం రేగింది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ధర్నాలు, ఆత్మహత్యాయత్నం ఘటనలు పెరగడంతో.. భద్రత పెంచారు.