వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆటో బీభత్సం సృష్టించింది. ఓ పాదచారుడిపై దూసుకెళ్లి ప్రాణాలు బలితీసుకున్న ఘటన రాయపర్తిలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన గూగులోత్ సుక్య... ఇంటికి వెళుతుండగా వరంగల్ నుంచి మండల కేంద్రానికి వస్తున్న ఆటో ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు.
రాయపర్తిలో ఆటో బీభత్సం... ఒకరు మృతి - Accident in Rayaparthi
వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆటో బీభత్సం సృష్టించింది. ఓ పాదచారుడిపై దూసుకెళ్లి ప్రాణాలు బలితీసుకున్న ఘటన రాయపర్తిలో చోటు చేసుకుంది.
రాయపర్తిలో ఆటో బీభత్సం... ఒకరు మృతి
ఆటో డ్రైవర్‌పై మృతుడి బంధువులు దాడికి దిగగా పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రమేశ్ వెల్లడించారు.
ఇదీ చూడండి:'ధరణిలో సమస్యలుంటే వెంటనే సంప్రదించాలి'