తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆటో పల్టీ... కూలీ కోసం వెళ్లి గాయాలపాలైన మహిళలు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లేటెస్ట్ అప్డేట్స్

కూలీ కోసం వేరే ప్రాంతానికి వెళ్తున్న తొమ్మిది మంది మహిళలు గాయాలపాలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యరం పరిధిలోని కూలీల ఆటో అదుపుతప్పింది. ఆటో పల్టీ కొట్టి డ్రైవర్​ సహా 9మందికి గాయాలయ్యాయి. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

auto accident in bhadradri kothagudem district
ఆటో పల్టీ... కూలీ కోసం వెళ్లి గాయాలపాలైన మహిళలు

By

Published : Oct 28, 2020, 3:12 PM IST

పొట్టకూటి కోసం వెళ్తుంటే అనుకోని ప్రమాదంలో వ్యవసాయ కూలీలు గాయాలపాలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యరం పరిధిలోని ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు ఏడో మైలు తండాకు వ్యవసాయ పనుల కోసం ఆటోలో బయలుదేరారు. ఇల్లందు శివారు ప్రాంతంలో ప్రమాదం జరిగి గాయపడ్డారు. ఎదురుగా వచ్చిన కోతిని తప్పించబోయి ఆటో అదుపుతప్పింది.

డ్రైవర్​తో సహా తొమ్మిది మంది మహిళలు గాయాల పాలయ్యారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు.

ఇదీ చదవండి:తటాకం ఉగ్రరూపం.. వెంచర్లను ముంచిన రావిర్యాల పెద్దచెరువు

ABOUT THE AUTHOR

...view details