అల్లుడిని హత్య చేసిన అత్త.. వివాహేతర సంబంధమే కారణం! - Hyderabad murder NEWS
10:45 October 29
అల్లుడిని హత్య చేసిన అత్త.. వివాహేతర సంబంధమే కారణం!
అత్తే అల్లుడిని హత్య చేసిన ఘటన హైదరాబాద్ రామంతపూర్‌లో చోటుచేసుకుంది. మీర్‌పేట త్రివేణి నగర్‌కు చెందిన నవీన్‌కుమార్ క్యాటరింగ్ నిర్వహిస్తూ అనిత అనే మహిళతో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే అనిత తన కుమార్తె వందనకు, నవీన్‌కు పెళ్లి చేసింది.
తల్లితో చనువుగా ఉండడం చూసి వందన చాలాసార్లు నవీన్‌ను హెచ్చరించింది. మనస్తాపం చెంది వందన పెళ్లైన కొత్తలోనే మార్చి 14న సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నవీన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైనప్పటినుంచి తనను దూరం పెడుతున్నాడని రామంతాపూర్‌లోని... కేసీఆర్ నగర్‌లోని నవీన్ ఇంటికి వెళ్లి అనిత కత్తితో పొడిచింది. అనంతరం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. అనితను ఉప్పల్ పోలీసులకు అప్పగించగా... కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.