ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా అమడగూరు మండలంలోని కస్సముద్రం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన అత్త, కోడలు ఒకేరోజు ప్రాణాలు విడిచారు. అత్త వెంకట రమణమ్మకు ఆరోగ్యం బాగాలేక కదిరి ఆసుత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె ఆసుపత్రిలో మృతి చెందింది.
అత్త మృతిని తట్టుకోలేక ఆగిన కోడలు గుండె
భర్త చనిపోయాడు.. కొడుకు దూరమయ్యాడు. దీంతో అత్త, కోడలు ఒక్కటై ఆ ఇంటిని నిలబెట్టారు. ఇద్దరు మగపిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ఇంతలో వీరి బంధం చూసిన విధికి కన్ను కుట్టిందేమో.. అత్త అనారోగ్యం కారణంగా ప్రాణాలు విడిచింది. ఇది చూసిన కోడలు గుండె పగిలి కుప్పకూలింది. ఏపీలోని అనంతపురం జిల్లాలో ఒకే రోజు అత్త, కోడలు మృతి చెందిన ఘటన పలువురిని కలచివేస్తోంది.
అత్త మృతిని తట్టుకోలేక ఆగిన కోడలు గుండె
మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా.. అత్త మృతదేహాన్ని చూసిన కోడలు మణెమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయి గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. అయితే వెంకటరమణమ్మ భర్త విద్యుత్ షాక్తో కొన్నేళ్ల క్రితం మృతి చెందగా.. మణెమ్మ భర్త రెండు సంవత్సరాల క్రితం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇవీ చూడండి...ప్రేమవివాహం చేసుకున్నాడు.. కుటుంబకలహాలతో శవమయ్యాడు