ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లలో రెండేళ్ల చిన్నారిపై.. అదే గ్రామానికి చెందిన మహేశ్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న మహేశ్... బాలికను ద్విచక్రవాహనంపై గ్రామానికి దూరంగా తీసుకువెళ్లాడు. కుమార్తె కనిపించకపోయేసరికి కంగారుపడిన తండ్రి.. మేదరమెట్ల పోలీసులకు సమాచారం అందించాడు.
దారుణం: రెండేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం - ap latest news
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదపమెట్లలో ఘోరం జరిగింది. రెండేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

దారుణం: రెండేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
మహేశ్‌పై అనుమానంతో పోలీసులు వెంటనే దర్యాప్తు చేశారు. అతడి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు పసిగట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేశారు. కక్షపూరితంగానే మహేశ్ ఈ పని చేశాడని ఆవేదన చెందాడు చిన్నారి తండ్రి.
- ఇదీ చదవండి: ఆస్ట్రేలియాలో తెలంగాణ యువతి దుర్మరణం