తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఏటీఎం చోరీకి విఫలయత్నం.. పోలీసులకు ఫిర్యాదు - సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామ పరిధిలోని కోటక్ మహేంద్రా బ్యాంకు ఏటీఎంలో చోరీయత్నం ఆలస్యంగా వెలుగుచూసింది. బ్యాంకు ప్రతినిధులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

Attempted ATM theft .. Complaint to police
ఏటీఎం చోరీకి విఫలయత్నం.. పోలీసులకు ఫిర్యాదు

By

Published : Sep 1, 2020, 11:39 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని కోటక్ మహీంద్రా బ్యాంకు ఏటీఎంలో ఆదివారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని వ్యక్తి చోరీకి యత్నించాడు. యంత్రాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. అది విఫలం కావడం వల్ల అక్కడి నుంచి వెనుదిరిగాడు.

అనంతరం అక్కడకు వెళ్లిన భద్రతా సిబ్బంది.. బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు బ్యాంకు ప్రతినిధులు పటాన్‌చెరు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇదీచూడండి.. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్ష ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details