ఏపీ మంత్రి పేర్ని నానిపై దాడి యత్నం కలకలం రేపింది. మచిలీపట్నంలో స్వగృహం నుంచి ఇవాళ ఉదయం మంత్రి బయటకు వస్తుండగా... గుర్తు తెలియని వ్యక్తి.. మంత్రి కాళ్లకు దండం పెట్టేందుకు ముందుకొచ్చాడు. అంతలోనే... భవన నిర్మాణాలకు ఉపయోగించే తాపీతో దాడికి యత్నించాడు. మొదటి దెబ్బ గురితప్పగా, రెండోసారి యత్నించేలోపు.. గుర్తించిన మంత్రి అనుచరులు, సిబ్బంది ఘటనను నివారించారు.
ఏపీ మంత్రి పేర్ని నానిపై దాడికి యత్నం
ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై ఓ వ్యక్తి తాపీతో దాడికి యత్నించాడు. ఆదివారం ఉదయం మంత్రి తన నివాసం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో మంత్రి నానికి తృటిలో ప్రమాదం తప్పింది.
ఏపీ మంత్రి పేర్ని నానిపై దాడికి యత్నం
నిందితుడు మచిలీపట్నానికి చెందిన తాపీ మేస్త్రీ బడుగు నాగేశ్వరరావుగా భావిస్తున్నారు. మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేవలం మద్యం మత్తులోనే దాడికి పాల్పడ్డాడా లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అదృష్టవశాత్తు తనకు గాయాలేవీ కాలేదని, క్షేమంగానే ఉన్నట్లు మంత్రి నాని తెలిపారు.
ఇదీ చదవండి:పులి దాడిలో మరొకరు మృతి.. భయాందోళనలో ప్రజలు