వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన సర్పంచ్ మంద సతీశ్‌పై దాడి చేశారు అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు. సర్పంచ్ మంద సతీశ్‌పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. కోటేశ్వర్ కుటుంబ సభ్యులు... భూమి పంచాయితీ విషయంలో తీర్మానానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
భూ పంచాయితీ విషయంలో తీర్మానానికి వెళ్లిన సర్పంచ్‌పై దాడి - Warangal Rural District news
భూ పంచాయితీ విషయంలో తీర్మానానికి వెళ్లిన సర్పంచ్‌పై దాడి చేశారు కొందరు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా కడారి గూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

భూ పంచాయితీ విషయంలో తీర్మానానికి వెళ్లిన సర్పంచ్‌పై దాడి
కులం పేరుతో దూషిస్తూ.. రాళ్లతో కొట్టి తీవ్రంగా దాడి చేశారు. దీనితో సర్పంచ్ తలపై, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్ర రక్తస్రావంతో ఉన్న సర్పంచ్ సతీశ్‌ను వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై ఎస్సీ సంఘాలు ఆందోళన నిర్వహించారు.
ఇదీ చదవండి:సీఎం కాన్ఫరెన్స్‌కు ఆహ్వానించారు.. అంతలోనే రావద్దన్నారు!