తమకు అనుకూలంగా వార్త రాయలేదని... తన ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేసినట్లు ఏపీలోని చిత్తూరు జిల్లా సోమల మండలానికి చెందిన ఓ విలేకరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలేకరి సొంతూరు కందూరులో యువకులు వీరంగం సృష్టించారు. ఇంట్లో ఉండే సామాన్లు బయటకు వేసి ధ్వంసం చేశారు.
లైవ్ వీడియో: అనుకూలంగా వార్త రాయలేదని విలేకరి ఇంటిపై దాడి - చిత్తూరు జిల్లాలో జర్నలిస్టు ఇంటిపై దాడి
అనుకూలంగా వార్త రాయలేదని ఆరాచకం సృష్టించాడు ఓ వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరులో విలేకరి ఇంటిపైకి దాడికి దిగాడు. ఇంటి ముందున్న సామాన్లన్నీ బయటపడేసి ధ్వంసం చేశాడు.
లైవ్ వీడియో: ఏపీలో విలేకరి ఇంటి ముందు వీరంగం సృష్టించిన వ్యక్తి
అనుకూలంగా వార్త రాయలేదని అక్కసుతో ఇంటిపై దాడిచేసి, చంపేస్తామని బెదిరించారని విలేకరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. యువకులు దాడి చేస్తున్న సమయంలో దృశ్యాలను రికార్డ్ చేసిన విలేకరి... వాటి ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
TAGGED:
latest news of chittoor dst