ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను విడదీసేందుకు వారు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారుతో ఢీకొట్టారు. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన నాగజ్యోతి, అక్షయ్‌లు ప్రేమించుకున్నారు. 2019 మే 28న వివాహం చేసుకున్నారు. 15 నెలలు కలిసి జీవనం సాగించారు. నెల రోజుల క్రితం తల్లికి గుండెనొప్పి వచ్చిందని నాగజ్యోతిని కుటుంబసభ్యులు ఇంటికి పిలిపించుకున్నారు. తమకు నచ్చని పెళ్లి చేసుకున్నావని, విడాకులు తీసుకోవాలని ఒత్తిడిచేశారు. లేదంటే అక్షయ్‌ని చంపేస్తామని బెదిరించి ఆగస్టులో విడాకులు ఇప్పించారు. అయినా వారి మధ్య మాటలు కొనసాగుతూనే ఉన్నాయి.
బైక్‌పై వెళ్తున్న ప్రేమజంటపై సినీ ఫక్కీలో దాడి - Attack on lovers in Bhainsa
బైక్‌పై వెళ్తున్న యువతీయువకుల జంటను యువతి కుటుంబీకులు కారులో వెంబడించి ఢీ కొట్టారు. అనంతరం యువకుడిపై దాడి చేసి, అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. సినీఫక్కీలో చోటు చేసుకున్న ఈ ఘటన నిర్మల్ జిల్లా భైంసాలో జరిగింది.
బైక్‌పై వెళ్తున్న ప్రేమజంటపై సినీ ఫక్కీలో దాడి
బుధవారం కుంటాల మండలం కల్లూర్ వాసవి కళాశాలలో డిగ్రీ పరీక్షలు రాసేందుకు నాగజ్యోతి వెళ్లింది. పరీక్ష తర్వాత అక్షయ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై భైంసాకు వస్తుండగా ఆమె సోదరులు ముగ్గురు వెంబడించి.. బిజ్జూర్-చింతల్‌బోరి గ్రామాల మధ్య కారుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. నాగజ్యోతికి తీవ్రగాయాలు కాగా, అక్షయ్‌పై కర్రతో దాడిచేశారు. నాగజ్యోతి, అక్షయ్ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు భైంసా గ్రామీణ ఎస్‌ఐ పున్నంచందర్ తెలిపారు.