తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. బాధితుడికి స్వల్ప గాయాలు - కిష్టాపురంలో మట్టయ్య అనే వ్యక్తిపై దాడి వార్తలు

సూర్యాపేట జిల్లా కిష్టాపురం గ్రామంలో తక్కిళ్ల మట్టయ్య అనే వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఘటనలో మట్టయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Attack by unidentified persons .. Minor injuries to the victim
గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. బాధితుడికి స్వల్ప గాయాలు

By

Published : Sep 19, 2020, 9:37 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన మట్టయ్య శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి మూత్ర విసర్జన కోసం బయటకు రాగా.. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు మట్టయ్యపై కత్తితో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

దాడిలో మట్టయ్య ఎడమ చేతిపై స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కోదాడ డీఎస్పీ రఘు, కోదాడ రూరల్ సీఐ శివరాంరెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్​ టీం సాయంతో ఆధారాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి.. సుమేధ మృతి ఘటనపై స్పందించిన ఎస్‌హెచ్‌ఆర్సీ

ABOUT THE AUTHOR

...view details