తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కాంగ్రెస్ నేతపై దాడి... తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

రంగారెడ్డి జిల్లా షాహీన్ నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ నేత అబ్దుల్ రవుఫ్‌పై దాడి జరిగింది. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీఐని కలిశారు. తనపై జరిగిన దాడిలో కొందరిపై అనుమానం ఉన్నట్లు బాధితుడు అబ్దుల్ రవుఫ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

attach-on-congress-leader-abdul-raouf-at-shaheen-nagar-in-rangareddy-district
కాంగ్రెస్ నేతపై దాడి... తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ

By

Published : Nov 2, 2020, 8:04 PM IST

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని షాహీన్ నగర్ ప్రాంతంలో మహేశ్వరం కాంగ్రెస్ నేత అబ్దుల్ రవుఫ్‌పై దాడి జరిగింది. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉజ్మా శాకిర్, సీనియర్ నేతలతో కలిసి గాయపడిన అబ్దుల్ రవుఫ్‌ను పరామర్శించారు. బాలపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి... ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐ భాస్కర్‌ను కోరారు. హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ.10వేలలో అవకతవకలు జరుగుతున్నాయని కొండ విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. దానిని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా... అది సహించక దాడి చేశారని ఆరోపించారు.

తనపై జరిగిన దాడిలో జల్​పల్లి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ సాది, తెరాస నేత యూసుఫ్ పటేల్ తదితరులపై అనుమానం ఉన్నట్లు బాధితుడు అబ్దుల్ రవుఫ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మాజీ ఎంపీ, టీపీసీసీ జనరల్ సెక్రటరీతో పాటు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు దేపా భాస్కర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, స్థానిక నేతలు సమద్ బిన్ సిద్దిక్ తదితరులు అబ్దుల్ రవుఫ్‌ను పరామర్శించారు.

ఇదీ చదవండి:పసికందు అపహరణ కేసును ఛేదించిన కర్నూలు పోలీసులు

ABOUT THE AUTHOR

...view details