తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఏటీఎం దొంగ అరెస్ట్... సీసీ కెమెరాలే ప్రధాన ఆధారం

మేడ్చల్ జిల్లా నాచారం పీఎస్ పరిధిలోని నాచారం క్రాస్ రోడ్డు వద్ద కెనరా బ్యాంక్ ఏటీఎం చోరీకి యత్నించిన దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుడ్ని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

ఏటీఎం దొంగ అరెస్ట్... సీసీ కెమెరాలే ప్రధాన ఆధారం
ఏటీఎం దొంగ అరెస్ట్... సీసీ కెమెరాలే ప్రధాన ఆధారం

By

Published : Aug 14, 2020, 10:03 AM IST

మేడ్చల్ జిల్లా నాచారం పోలీస్​ స్టేషన్ పరిధిలోని నాచారం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు ఏటీఎం దొంగను అరెస్ట్ చేశారు. ఉప్పల్ పీఎస్ పరిధిలోని హేమానగర్​కు చెందిన రాములు ఏటీఎంలో దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. ఒక్కరోజులోనే ఈ కేసును ఛేదించిన నాచారం పోలీసులను ఉన్నతాధికారులు ప్రశంసించారు. నిందితుడు గతంలోనూ పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అది తెరుచుకోలేదని పారిపోయాడు..

ఏటీఎం దోపిడీ యత్నంలో డబ్బులు ఉన్న బాక్స్ తెరుచుకోకపోవడం వల్ల నేరగాడు పారిపోయాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

ఇవీ చూడండి : వైరస్​ విలయం: రెండు కోట్ల 10 లక్షలకు కేసులు

ABOUT THE AUTHOR

...view details