మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రధాన రహదారి పక్కన ఏటీఎంలో చోరీ ఘటన పోలీసులకు సవాలుగా మారింది. బ్యాంకులో రెండు రోజుల వ్యవధిలో రూ. 40 లక్షల వరకు నగదును పెట్టగా... వినియోగదారులు డ్రా చేసింది, ఎంత దోపిడీకి గురైంది ఎంత అని తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
సవాల్‌గా మారిన జడ్చర్ల ఏటీఎం చోరీ - సవాల్ గా జడ్చర్ల ఏటీఎం చోరీ
జడ్చర్లలో జరిగిన ఏటీఎం చోరీ పోలీసులకు సవాల్ గా మారింది. పెద్ద మొత్తంలో నగదును తస్కరించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
సవాల్ గా మారిన జడ్చర్ల ఏటీఎం చోరీ
ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. దొంగతనం ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా పనిగా భావిస్తున్నారు. సీసీ కెమెరాల కనెక్షన్ కట్ చేసి దుండగులు దోపిడీ చేసినట్లు వివరించారు.