తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఏటీఎం ధ్వంసం.. క్యాష్ బాక్స్​ ఎత్తుకెళ్లిన దుండగులు - ఏటీఎంలో చోరీ

ఏటీఎంను ధ్వంసం చేసి... దుండగులు క్యాష్ బాక్స్​లను ఎత్తుకెళ్లిన ఘటన నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లిలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలోకి ప్రవేశించి కత్తులు, ఇనుప రాడ్డులతో పెకిలించారు.

atm demolish in dichpally and cash theft
ఏటీఎం ధ్వంసం.. క్యాష్ బాక్స్​ ఎత్తుకెళ్లిన దుండగులు

By

Published : Oct 21, 2020, 11:16 AM IST

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని రెండు ఏటీఎంలను దొంగలు పూర్తిగా ధ్వంసం చేశారు. అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు... కత్తులు,ఇనుప రాడ్డులతో పెకలించారు.

యంత్రాలను ధ్వంసం చేసి ఏటీఎం మిషన్లలో క్యాష్ బాక్సులు ఎత్తుకెళ్లారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు విచారణ చేపట్టారు. అయితే ఎంత మొత్తంలో నగదు చోరీ జరిగిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:చైనా సైనికుడిని పీఎల్‌ఏకు అప్పగించిన భారత్​

ABOUT THE AUTHOR

...view details