తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

డబ్బులు తీసిస్తానంటాడు.. అసలు కార్డుతో ఉడాయిస్తాడు.. చివరికి? - atm thief arrest in badrachalam

ఏటీఎం వద్దకు వచ్చే వృద్ధులు, అమాయకులే అతని టార్గెట్​. డబ్బులు తీసిస్తానంటూ నమ్మబలుకుతాడు. అనంతరం నకిలీ కార్డు వారి చేతుల్లో పెట్టి అసలు కార్డుతో ఉడాయిస్తాడు. తర్వాత ఆ ఖాతాల్లోంచి నగదు డ్రా చేస్తూ.. ఎంజాయ్​ చేస్తాడు. ఇలా ఎంతో మందిని మోసం చేసిన ఆ నేరగాడు.. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు.

ATM card thief arrested by badrachalam police
డబ్బులు తీసిస్తానంటాడు.. అసలు కార్డుతో ఉడాయిస్తాడు.. చివరికి?

By

Published : Oct 27, 2020, 7:39 PM IST

ఏటీఎంల వద్దకు వచ్చిన అమాయకులు, వృద్ధులను బురిడీ కొట్టిస్తూ.. వారి ఏటీఎంల నుంచి రూ.లక్షలు డ్రా చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న దుండగుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన ప్రశాంత్ భద్రాచలంలోని ఓ ఏటీఎంలో నగదు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ స్వామి తెలిపారు. నిందితుని వద్ద నుంచి రూ.1.5 లక్షల నగదు, ఓ ద్విచక్ర వాహనం, కొన్ని ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఏటీఎంలో డబ్బుల కోసం వచ్చిన వృద్ధులు, అమాయకులను టార్గెట్​ చేసి.. నగదు తీసిస్తానంటూ వారి కార్డు తీసుకుంటాడు. ఈ క్రమంలో వారికి నకిలీ ఏటీఎం కార్డు ఇచ్చి.. అసలు కార్డుతో ఉడాయిస్తాడు. అనంతరం వారి ఖాతాల్లోంచి డబ్బులు డ్రా చేసుకుంటాడు. 2015 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని మోసం చేశాడు. ఇతనిపై ఇప్పటికే 15 కేసులు నమోదయ్యాయి. సీఐ స్వామి

ఇదీ చూడండి.. చిన్నారి హత్య కేసులో నిందితునికి 4 రోజుల కస్టడీ

ABOUT THE AUTHOR

...view details