తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బంగారం దుకాణంలో చోరీకి విఫలయత్నం - సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు తాజా వార్తలు

అర్ధరాత్రి ఆరుగురు దుండగులు చోరీకి ప్రయత్నించారు. ఏకంగా ఓ బంగారం దుకాణానికి కన్నం వేయడానికి సిద్ధమయ్యారు. గోడను కొంత పగులగొట్టారు. కానీ ఆ షాపు పక్కన ఉన్న వ్యక్తి కేకలు వేయడంతో వారి పథకం పారలేదు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో మంగళవారం రాత్రి జరిగింది.

at-midnight-six-thugs-attempted-the-robbery-at-patancheru
అర్ధరాత్రి ఆరుగురు దుండగులు చోరీకి యత్నం

By

Published : Aug 20, 2020, 7:43 AM IST

అర్ధరాత్రి ఆరుగురు దుండగులు చోరీకి యత్నం

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జేపీ కాలనీకి చెందిన జీవరామ్ చౌదరి వర్తక వ్యాపార సంఘ కూడలి సమీపంలో బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి దుకాణం మూసేసి ఇంటికెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో ఆరుగురు దుండగులు వచ్చి బంగారం దుకాణం వెనుక గోడకు కన్నం వేయడానికి ప్రయత్నించారు.

పక్కగదిలో ఉన్న వ్యక్తి ఆ శబ్దాలు విని కేకలు వేశాడు. అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వస్తున్నారని చెప్పడం వల్ల దొంగలు ఉడాయించారు. ఆరుగురు దొంగలు పలుగు తీసుకుని సమీప ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. బంగారం షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష- లాభాలు ఇవే...

ABOUT THE AUTHOR

...view details