స్నేహితురాలు తనతో మాట్లాడటం లేదని కక్షతో వాట్సాప్‌లో అసభ్యకరంగా సందేశాలు పంపుతూ వేధిస్తున్న రోహిత్ ఆర్యన్ అనే యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఇద్దరూ పంజాగుట్టలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేశారు. అప్పుడు ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.
వాట్సాప్‌లో వేధింపులు.. చివరికి కటకటాలు - young man has been arrested for harassing a young woman via WhatsApp
స్నేహితురాలు తనతో మాట్లాడటం లేదని కక్ష పెంచుకున్నాడు. వాట్సాప్ ద్వారా వేధింపులకు దిగాడు. బాధితురాలు ఫిర్యాదుతో చివరికి కటకటాల పాలయ్యాడు.
Hyderabad latest news
ఆరు నెలలుగా ఇద్దరి మధ్య విభేదాలు రావడం వల్ల యువతి అతనితో మాట్లాడటం మానేసింది. కక్ష్య పెంచుకున్న ఆర్యన్... వాట్సాప్‌లో అసభ్యకరంగా సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడు. దీంతో యువతి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు కడప జిల్లా జమ్మలమడుగుకి చెందిన రోహిత్ ఆర్యన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.