కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూ మండలంలోని పంగిడికి చెందిన కంబారే జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జీవితి తాలూకు నుంచి నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు తీసుకువస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్ - latest crime news kumuram bheem asifabad district
పక్క రాష్ట్రం నుంచి నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు రాష్ట్రంలోకి తెచ్చి రైతులకు విక్రయిస్తున్నారు కొంత మంది మోసగాళ్లు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూ మండలంలోని పంగిడికి చెందిన కంబారే జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జీవితి తాలూకా నుంచి నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు తీసుకువస్తుండగా జైనూర్ మండలం భూసిమెట్ట వద్ద పట్టుకున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.
నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
బూసిమెట్ట వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో జ్ఞానేశ్వర్ వద్ద 62 వేల రూపాయల విలువ గల 89 విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తిరుపతి చెప్పారు. నిందితునితోపాటు ఆత్మారాం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. విత్తనాలు నేరుగా దుకాణాల నుంచి కొనుగోలు చేసి రసీదులు తీసుకోవాలని రైతులకు సూచించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్ కేసులు