తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

డ్రగ్స్ సరఫరా చేస్తోన్న ఇద్దరు నిందితుల అరెస్ట్ - News today Amberpeta Drugs

హైదరాబాద్ అంబర్​పేట పీఎస్ పరిధిలోని పాలిటెక్నిక్ బస్టాప్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3 లక్షల విలువ చేసే 90 గ్రాముల మెపిడ్రోన్ డ్రగ్స్, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ సరఫరా చేస్తోన్న ఇద్దరు నిందితుల అరెస్ట్
డ్రగ్స్ సరఫరా చేస్తోన్న ఇద్దరు నిందితుల అరెస్ట్

By

Published : Sep 11, 2020, 10:38 PM IST

హైదరాబాద్ అంబర్​పేట పీఎస్ పరిధిలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్​కు చెందిన మనోహర్ 6 నెలల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్​కు వచ్చి మీర్​పేటలో నివాసముంటున్నాడు.

అక్రమ సంపాదనే లక్ష్యం..

నెలవారీ ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడం వల్ల అక్రమ సంపాదననే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తమ రాష్ట్రానికే చెందిన మనోజ్​తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయించటం మొదలుపెట్టారు.

అలా వ్యవహారం బయటపడింది..

పాలిటెక్నిక్ బస్టాప్ వద్ద డ్రగ్స్ విక్రయించేందుకు యత్నించిన మనోహర్​ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వ్యవహారం బయటపడింది. అనంతరం నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

డ్రగ్స్ సరఫరా చేస్తోన్న ఇద్దరు నిందితుల అరెస్ట్

ఇవీ చూడండి : బుల్లితెర నటి శ్రావణి కేసులో ఆసక్తికర విషయాలు

ABOUT THE AUTHOR

...view details