తెలంగాణ

telangana

By

Published : Oct 9, 2020, 9:53 PM IST

ETV Bharat / jagte-raho

యువతి మృతికి కారణమైన గోకార్టింగ్​ నిర్వాహకుల అరెస్టు

యువతి మృతికి కారణమైన గోకార్టింగ్​ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. అనుమతులు లేకుండా గోకార్టింగ్​ను నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దానిని పోలీసులు సీజ్​ చేశారు.

Arrest of go-karting operators responsible for girl death in hyderabad
యువతి మృతికి కారణమైన గోకార్టింగ్​ నిర్వాహకుల అరెస్టు

యువతి మృతికి కారణమైన గోకార్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు.. గోకార్టింగ్​ను సీజ్ చేశారు. హైదరాబాద్​ మీర్​పేట్​ పీఎస్​ పరిధిలోని గుర్రంగూడలో రోహిత్, కిరణ్, శ్రీకాంత్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి హాస్టన్ గోకార్టింగ్​ను నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే దీన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కనీస భద్రత ప్రమాణాలు కూడా నిర్వాహకులు పాటించడం లేదని పోలీసులు గుర్తించారు. లాక్​డౌన్ నిబంధనలకు విరుద్ధంగా దీన్ని నిర్వహిస్తున్నారు.

ఈనెల 7న వర్షిని అనే బీటెక్ విద్యార్థిని హాస్టన్ గోకార్టింగ్​కి వెళ్లింది. గోకార్టింగ్ చేస్తున్న సమయంలో హెల్మెట్ కింద పడిపోయింది. ఈ సమయంలో వర్షిని తలవెంట్రుకలు వెనక టైర్​లో చిక్కుకొని కిందపడి ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలి సోదరుడు మీర్​పేట్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇవీ చూడండి: గోకార్టింగ్ చేస్తుండగా యువతి మృతి

ABOUT THE AUTHOR

...view details