తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తండ్రిని చంపిన కుమారుడి అరెస్టు.. రిమాండ్

తండ్రి కనిపించడం లేదని అర్ధరాత్రి స్నేహితులకు ఫోన్​ చేసి బాధ పడ్డాడు. తెల్లారి పొలంలో శవం దొరికిందని సృష్టించాడు. ఎవరో తన తండ్రిని హతమార్చారని పోలీసులను ఆశ్రయించాడు. కానీ కుట్ర బట్టబయలై దోషిగా నిలబడ్డాడు.

Arrest and remand  of son who killed father
తండ్రిని చంపిన కుమారుడి అరెస్టు.. రిమాండ్

By

Published : Apr 29, 2020, 2:07 PM IST

Updated : Apr 29, 2020, 2:28 PM IST

నారాయణపేట జిల్లా లక్ష్మీపూర్​కు చెందిన ప్యాట గోపాల్​ హత్య కేసు నిందితుడిని పోలీసులు రిమాండ్​కు తరలించారు. ఈ నెల 19న గోపాల్​ను అతని కుమారుడు చిరంజీవి అతి కిరాతకంగా హతమార్చినట్టు సీఐ శ్రీకాంత్​ రెడ్డి వెల్లడించారు. గ్రామస్థులను నమ్మించేందుకు తండ్రి కనిపించడం లేదని స్నేహితులకు అర్ధరాత్రి ఫోన్​ చేసి చెప్పినట్టు దర్యాప్తులో తేలింది.

తండ్రి కోసం వెతకగా... పొలంలో శవం కనిపించినట్టు అందరినీ నమ్మించాడు. పైగా తండ్రిని ఎవరో హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించి... కత్తితో చిరంజీవి తండ్రిని హతమార్చినట్టు నిర్ధారించారు.

డబ్బుల విషయంలో వారం రోజుల క్రితం తండ్రీకొడుకుల మధ్య వివాదం జరిగినట్టు సీఐ తెలిపారు. వివాదంలో కొడుకును తండ్రిని తీవ్రంగా గాయపరిచినట్టు చెప్పారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని తండ్రిని హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి

Last Updated : Apr 29, 2020, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details