తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అఖిలప్రియ అరెస్ట్.. కాసేపట్లో కోర్టులో హాజరు - భూమా అఖిల ప్రియ వార్తలు

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటలోని లెర్నింగ్ సెంటర్‌కు తరలించారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ పరారీలో ఉన్నారు. అఖిలప్రియను గాంధీకి తీసుకెళ్లిన పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. కాసేపట్లో సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో హాజరుపర్చనున్నారు.

bhuma akjilapriya
bhuma akjilapriya

By

Published : Jan 6, 2021, 2:19 PM IST

Updated : Jan 6, 2021, 5:21 PM IST

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లిలోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకుని బేగంపేటలోని లెర్నింగ్ సెంటర్‌కు తరలించారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆమె బంధువులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అఖిలప్రియను గాంధీకి తీసుకెళ్లిన పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. కాసేపట్లో సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో హాజరుపర్చనున్నారు.

బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల అపహరణ వ్యవహారంలో అఖిలప్రియ దంపతుల ప్రమేయంపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఓ భూవివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావు కుటుంబానికి, భూమా అఖిల ప్రియ కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసును ఛేదించామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. కిడ్నాప్‌ కేసు నిందితులందరినీ పట్టుకున్నామని తెలిపారు.

గాంధీ ఆసుపత్రికి అఖిలప్రియ.. పరారీలో ఆమె భర్త
Last Updated : Jan 6, 2021, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details