బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావు అపహరణ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సమయంలో అఖిలప్రియ ఆసుపత్రిలో కళ్లు తిరిగిపోయారు. వైద్యులు ఆమెకు సెలైన్ ఎక్కించారు. సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఆమెను హాజరుపర్చారు.
కళ్లు తిరిగి పడిపోయిన అఖిలప్రియ - bhuma akhila priya arrest latest updates
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితురాలైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుప్రిలో వైద్య పరీక్షలు చేయించేందుకు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆమె కళ్లు తిరిగిపడిపోయారు. వైద్యులు ఆమెకు సెలైన్ ఎక్కించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఆమెను హాజరుపర్చారు.
ఓ భూమికి సంబంధించిన వివాదంలో ప్రవీణ్‌రావుతో పాటు ఆయన సోదరులను దుండగులు కిడ్నాప్ చేశారు. ఐటీ అధికారులమని బెదిరించి పత్రాలపై సంతకాలు తీసుకొని ముగ్గురినీ కారులో ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ లోపే కిడ్నాప్ చేసిన ముగ్గురినీ దుండగులు నార్సింగి వద్ద వదిలి పరారయ్యారు. భూమా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏవీ సుబ్బారెడ్డితోపాటు అఖిల భర్త భార్గవరామ్, ఆయన సోదరుడు చంద్రహాస్ హస్తముందని తేల్చారు. అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డి, ఫాంహౌస్ కాపలాదారుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఆమె బంధువులనూ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.