ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉద్యమంలో మరో మహిళా రైతు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడానికి చెందిన పాతూరి హైమావతి(58) సోమవారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందారు. అమరావతి నిర్మాణానికి హైమావతి ఎకరం భూమి ఇచ్చారు. ఉద్యమ ప్రారంభం నుంచి హైమావతి చురుగ్గా పాల్గొంటున్నారని రైతులు తెలిపారు. రోజూ తమతో ఉద్యమంలో పాల్గొన్న మహిళ ఒక్కసారిగా మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
అమరావతిలో గుండెపోటుతో మహిళా రైతు మృతి - అమరావతిలో గుండెపోటుతో మహిళా రైతు మృతి
ఏపీ రాజధాని అమరావతిలో మరో మహిళా రైతు గుండె ఆగింది. మందడం గ్రామానికి చెందిన పాతూరి హైమావతి(58) అనే మహిళ మృతి చెందింది. రాజధాని నిర్మాణానికి హైమావతి ఎకరం పొలం ఇచ్చినట్లు రైతులు పేర్కొన్నారు.
అమరావతిలో గుండెపోటుతో మహిళా రైతు మృతి